మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని రైతులకు ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డీఆర్ఎస్ మంచిర్యాల సిటీ అధ్యక్షుడు గాదె సత్యం డిమాండ్ చేశారు. కరువు పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదని, పంటల సాగు, విద్యుత్, ఎరువులు, కొనుగోళ్లపై హామీ ఇవ్వాలని కోరారు.
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డ బీ ఆర్ఎస్ మంచిర్యాల సిటీ అధ్యక్షుడు గాదె సత్యం డిమాండ్ చేశారు. బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, కరువు పేరుతో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదని అన్నారు. బావులు, చెరువుల కింద సుమారు 20 శాతం మంది రైతులు నార్లు పోసి పంట సాగుకు సిద్ధమవుతున్నారని, వారికి విద్యుత్, ఎరువులు, పురుగుమందుల సరఫరాతో పంట కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు ,త్రాగునీరు రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించి ఉంటే నీటి ఎద్దడి పరిస్థితి తలెత్తేది కాదని అన్నారు. నవంబర్లోనే తాగునీటి సమస్యలు తీవ్రం కావడం ప్రభుత్వ ముందుచూపు లేమికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా మంచిర్యాల ఎమ్మెల్యేతో జిల్లా అధికార యంత్రాంగం రైతులకు పంటల సాగు, విద్యుత్, ఎరువులు, కొనుగోళ్లపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రాజు, సీనియర్ నాయకులు తోట తిరుపతి, వడ్నాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.












