భీమారం, 28 June
భీమాగామకబెడవాకమవవేకవెకటవామకటకషూాయమాయమయయాయ.ఈధమఒకమఖాాకమళకాగామా.మకెయకడాేధఇఖాాకవెళాయెా.
ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు, చెన్నర్ నియోజకవర్గం భీమారం గ్రామంలో ఏం జరుగు తుందిన ప్రజలు మిత్ర చూపులతో చూస్తున్నారు. గత పదేళ్లుగా భీమారంలో కోతుల బెడద ఎక్కువైందని, ఈ సమస్యపై ఏ నాయకుడికి చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు.
చివరకు గత సంవత్సరం భీమారం గ్రామ యువత ముందుకు వచ్చి, ప్రతి ఇంటికి తిరిగి డబ్బులు జమచేసి, ఒక్కో కోతికి దాదాపు రూ.600 పైగా ఖర్చుచేసి వందలాది కోతులను పట్టి, దూరంగా ఉన్న అడవిలో వదిలేశారు. ఈ విషయం మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి వెళ్లగా, ఆయన లక్షన్నర రూపాయలను ప్రకటించారు.
అయితే, ఒక సంవత్సరం తర్వాత ఆ నిధులు విడుదలైనా, భీమారం గ్రామపంచాయతీకి ఆ విషయం తెలియలేదు. మంత్రి అనుచరుల్లో ఒకరు ఆ నిధులను తమ ఖాతాలోకి మళ్లించుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇప్పటివరకు ఏ నాయకుడు స్పందించలేదు. చివరకు ఏమవుతుందో వేచి చూడాలని ప్రజలు అంటున్నారు.
ఈ విషయంపై సర్పంచులను వివరణ కోరగా, తమకు తెలియకుండానే ఇతరుల ఖాతాల్లోకి నిధులు జమ అయినట్లు వారు తెలిపారు.










