
గోదావరి నదీ తీరాన ఉన్న మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ఐదేళ్లలో నాలుగుసార్లు వరదలకు గురైంది. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగుతున్న జనరల్ ఆసుపత్రి భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. కొత్త భవనం నిర్మాణం ఆలస్యం కావడంతో ఈ ఏడాది కూడా వరద ముప్పు తప్పదా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.



















