మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు చార్వక ట్రస్ట్ అధినేత, కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠేశ్వర గౌడ్ సౌజన్యంతో నిర్వహించారు.
సింగరేణి 3 ఏ 3 బి గనుల కార్మికుల యువత కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. విజేతలకు నగదు బహుమతులు అందించారు.
ప్రథమ బహుమతిగా రూ. 12,000, ద్వితీయ బహుమతిగా రూ. 8,000 నగదును విజేతలకు అందజేశారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలకంఠేశ్వర గౌడ్ విజేతలకు నగదు బహుమతులను అందజేసి, వారి ప్రతిభను అభినందించారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో క్రికెట్ ఆర్గనైజర్ కారు గుడి మనోజ్, లచ్చన్న, రాజేశం గౌడ్, దేవన్న తదితరులు పాల్గొన్నారు.











