సంగారెడ్డి జిల్లా మండల వ్యవసాయ అధికారి రమేష్ రూ.20 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా రమేష్ రూ.20,000 లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖకు చెందిన మండల స్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో కలకలం రేగింది. అయితే, ఈ లంచం ఏ పనికి సంబంధించి తీసుకున్నారు, ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు, ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆధారాలు ఏమిటి అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

