ఆదిలాబాద్, 26 October
వాట్సాప్ లింకుల ద్వారా ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి రూ. 4.20 లక్షలు కాజేసిన రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడు దినేష్ పటేల్‌ను బేలా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు.
బేలా పోలీసులు సైబర్ నేరస్తుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై 220 కేసులు నమోదయ్యాయి. వాట్సాప్ లింకుల ద్వారా ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి రూ. 4.20 లక్షలు కాజేసిన రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడు దినేష్ పటేల్‌ను బేలా పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుడు అమ్మాయిల వలపు సేవల పేరుతో నకిలీ లింకులు పంపుతూ దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు, అతనిపై దేశవ్యాప్తంగా 220, తెలంగాణలో 20 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు.

