మంచిర్యాల జిల్లా మండలం తాళ్లపేట గ్రామంలో జరిగిన దాడి ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మంచిర్యాల అసెంబ్లీ కాంగ్రెసులో వర్గ పోరు బగ్గు అంటున్నాయి రెండు రోజులుగా ఘర్షణలు చెలరేగుతూ అటు తాళ్లపేట తో పాటు మంచిర్యాల సైతం హై అలర్ట్ కు గురయ్యింది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్లో వర్గ పోరు అసమ్మతి సెగలు రగులుతున్నాయి. అసమ్మతి నేత జగన్మోహన్రావు ఇంటిని పోలీసులు దిగ్బంధించారు ఈ క్రమంలోనే దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని వెంటనే లక్షెటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్షటిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపేట గ్రామానికి చెందిన పేరం రజిత (40), తన సోదరుడు ఆకుల రాజేంద్ర ప్రసాద్, మేనల్లుడు ఆకుల అకిరానందన్తో కలిసి జమ్మికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారి పొరుగువారైన ఆకుల కిరణ్, ఆకుల రాజేందర్, ఆకుల సురేష్, ఆకుల విజయ్ వర్ధన్, ముట్టె కుమారస్వామి, ఎర్రం మల్లేష్లు తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలు, చేతులతో దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో ఆకుల రాజేంద్ర ప్రసాద్, ఆకుల అకిరానందన్ల తలలకు గాయాలు కాగా, పేరం రజిత చేతికి గాయమైనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, నిందితులు తమను తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. బాధితురాలు రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, ఆకుల కిరణ్, ఆకుల సురేష్, ఆకుల విజయ్ వర్ధన్లను అరెస్టుచేసి రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తుంది. మంచిర్యాలలో మాత్రం ఎమ్మెల్యే వర్గం జగన్ పై దాడి చేస్తుందన్న సమాచారం తో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి బందోబస్తు చర్యలు చేపట్టారు. సిటీలో ఏ క్షణం ఏం జరుగుతుందో అంతు పట్టడం లేదు. కాంగ్రెస్ రాజకీయాలు రచ్చకెక్కయి ఎమ్మెల్యే మంత్రి ఎంపీ వర్గాల పోరు తీవ్ర రూపం దాల్చినట్లు కనిపిస్తుంది.

