పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన, స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన, స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శివానందం మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను, సంతృప్తిని కలిగించిందని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతాంగం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












