సర్వజననీ దుర్గాదేవి పూజ 18వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వనాథ కాలక్షేప మండపం, ముఖరం చౌరస్తా వద్ద దుర్గ దేవి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. షష్టి పూజల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీమతి అధిత పాల్గొన్నారు.
ముఖరం చౌరస్తాలోని విశ్వనాథ కాలక్షేప మండపం వద్ద సర్వజననీ దుర్గాదేవి పూజ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గ దేవి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. షష్టి పూజల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన, ఆఖండ దీప ప్రజ్వలనను మహిళా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మూడు రాష్ట్రాల (గోవా, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్) మహిళా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీమతి అధిత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమములో బోడ ధర్మేందర్, అత్తి సరోజ, రీనా రాణి దాస్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












