నస్పూర్, 2026-08-09
చయుకొేధ32వవశీదశకఅవఉవుఅటటహయ.ఈవేుకేయధధుకఅవకచ,భకచటుకుు.యటీేయ,ఇయకుుకొయేకుచేశు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగర మేయర్ ధర్ని మధుకర్ అమ్మవారికి బోనం సమర్పించారు. డిప్యూటీ మేయర్ సళ్ల రమ్య, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో పాటు పలువురు నాయకులు, భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులు కోరిన నాయకులు
మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని నాయకులు వేడుకున్నారు. భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ బోనాల జాతర ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











