హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం కేంద్రానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు కందుకూరి మహేశ్వర చారి దంపతుల 16వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి అందించిన వివరాల ప్రకారం, శ్రీ పశుపతినాథ స్వామివారికి పంచామృత సహిత రుద్రాభిషేకం, సహస్ర నామార్చనలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు.
పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.








