హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రంలోని వల్భాపూర్ గ్రామంలో గల శ్రీ పశుపతినాథ దేవస్థానంలో ప్రముఖ పాత్రికేయుడు కందుకూరి మహేశ్వర చారి దంపతుల 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భాగంగా శ్రీ పశుపతినాథ స్వామివారికి పంచామృత సహిత రుద్రాభిషేకం, సహస్ర నామార్చనలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి తెలిపారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆలయ అర్చకులు మాట్లాడుతూ, కందుకూరి మహేశ్వర చారి దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని శ్రీ గౌరీ సమేత పశుపతినాథ స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ వార్షికోత్సవ వేడుకలకు కందుకూరి మహేశ్వర చారి దంపతుల కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.











