భీంపూర్ మండలం ఖైర్ గూడ గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో, గ్రామ సర్పంచ్ మెస్రం కోమల్ గత రెండు నెలలుగా విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వాలంటీర్ జీతం అందక మానేయడంతో సర్పంచ్ ఈ బాధ్యతలు స్వీకరించారు.
భీంపూర్ మండలం ఖైర్ గూడ గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో, గ్రామ సర్పంచ్ మెస్రం కోమల్ గత రెండు నెలలుగా విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలలో పనిచేస్తున్న వాలంటీర్ కు జీతం అందకపోవడంతో విధులకు గైర్హాజరయ్యారు. ఈ కారణంగా గ్రామ సర్పంచ్ మెస్రం కోమల్ టీచర్ గా మారారని అందర్బంద్ కాంప్లెక్స్ హెచ్ఎం అంగీకరించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు విన్నవించామని, శాశ్వత ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారని ఆయన తెలిపారు.












