హైదరాబాద్, జూలై 4
హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో బవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్పయనం ఎంపీ్రెన్యూర్షిపయనం్ ఆధ్వర్యంలో జరిగిన "బవర్ యూజీ సమర్థత సామర్థ్యం పట్టుదల ఉన్నత దిశగా పయనం్మిట్ 2.0"లో పయనంెద్దపయనంల్లి ఎంపయనంీ గడ్డం వంశీకృష్ణ పయనంాల్గొన్నారు. "నేడు నాకు 18 సంవత్సరాల వయస్సు ఉంటే?" అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో ఆయన ముఖ్య వక్తగా వ్యవహరించారు.
హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో నిర్వహించిన బవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలోని "బవర్ యూజీ సమ్మిట్ 2.0" కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు పాల్గొన్నారు.
"నేడు నాకు 18 సంవత్సరాల వయస్సు ఉంటే?" అనే భావనతో నిర్వహించిన ఈ సదస్సులో ఎంపీ గారు ముఖ్య వక్తగా హాజరై, "భారత యువత భవిష్యత్తు – నిర్మాణం, నాయకత్వం మరియు పారిశ్రామిక అవకాశాలు" అనే అంశంపై విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ, నేటి యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉద్యోగాలను కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగడం ద్వారా ప్రపంచ స్థాయిలో భారత యువత సత్తా చాటగలరని పేర్కొన్నారు.
యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా ఇటువంటి సదస్సులు ఎంతో ఉపయోగకరమని ఎంపీ గారు అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువత చేతుల్లోనే ఉందని, ప్రతి విద్యార్థి తన కలలను లక్ష్యాలుగా మార్చుకుని వాటి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు, అధ్యాపకులు, స్టార్టప్ ప్రతినిధులు, విద్యా రంగ నిపుణులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారిని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.








