నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమ స్ఫూర్తితో స్థానిక పీఎం శ్రీ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో విద్యా వారోత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఉదయం బడిబాట ర్యాలీ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాఠశాల ప్రాముఖ్యతను చాటారు.
పదో తరగతిలో విశేష ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను గ్రామ పెద్దలు ఆశీర్వదించారు.
ఈ విద్యా వారోత్సవాలు విద్యార్థులలో విద్యాభివృద్ధికి, పాఠశాల పట్ల అవగాహన పెంపునకు దోహదపడ్డాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












