Mancherial/Hajipur (అక్షరవేకువ) జూన్ 28
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల జెడ్పిఎస్ఎస్ పాఠశాలను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు శనివారం ఆకస్మికంగా సందర్శించి, తరగతి గదులను, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
హాజీపూర్ మండలం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల జెడ్పిఎస్ఎస్ పాఠశాలను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మంచినీటి సమస్య ఉన్నట్లు విద్యార్థులు చెప్పగా, వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మూడు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.











