సంగారెడ్డి, 2026-08-06
సంగారెడ్డి జిల్లాకు చెందిన డిగ్రీ ఉత్తీర్ణులైన అర్హులైన అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్)2027 ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 7 చివరి తేదీ అని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.జగదీష్ తెలిపారు.

మొత్తం 150 మందికి ప్రవేశం కల్పించనుండగా, వారిలో 100 మందిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా, గతంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 50 మందికి నేరుగా అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.5,000 స్టైపెండ్, ఒకసారి రూ.5,000 పుస్తక నిధి, గ్రంథాలయ సౌకర్యం, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, సబ్జెక్ట్వారీ పరీక్షలు, మూల్యాంకనం అందజేస్తారని తెలిపారు.
డిగ్రీ ఉత్తీర్ణులై, ఉద్యోగంలో లేకుండా, ఇతర కోర్సులు చదవని, నిర్దేశిత ఆదాయ పరిమితి కలిగిన అభ్యర్థులు అర్హులు అని, స్క్రీనింగ్ పరీక్ష ఆగస్టు 16న, తరగతులు ఆగస్టు 24న ప్రారంభమవుతాయని అన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 08455-277015, 9494390803 నంబర్లను సంప్రదించాలని సూచించారు.