Mancherial/Jaipur (అక్షరవేకువ) జూలై 10
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో టేకుమట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సుస్థిరతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను, ప్రకృతి సంరక్షణలో భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక టేకుమట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో పర్యావరణ సుస్థిరతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను, ప్రకృతి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన బాధ్యతను నిర్వాహకులు వివరించారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ ప్రతినిధులు డి.జి.ఎమ్ సీహెచ్. వాసుదేవమూర్తి, అశోక్; పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి; టేకుమట్ల గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్, ఉప సర్పంచ్ గోనే ప్రవీణ్; కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గోనే నర్సయ్య, వార్డ్ మెంబర్ అశోక్, నాయకులు ఈగ సురేందర్, ప్రశాంత్; పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ అలవాట్లను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. చెట్లను నాటడం, నీటిని పొదుపుగా వాడుకోవడం, పరిశుభ్రతను పాటించడం ద్వారా సుస్థిర భవిష్యత్తును నిర్మించవచ్చని వారు సూచించారు.











