ఆదిలాబాద్, 2026-11-22
ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా వాతావరణం చల్లబడి, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుని, గత మూడు రోజులుగా చల్లటి వాతావరణం ఏర్పడింది. మూడు రోజుల క్రితం వేడి వాతావరణం ఉండగా, చల్లటి గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈ చల్లటి వాతావరణంతో వర్షం కురుస్తుందేమోనని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆలా జరగలేదు. కేవలం ఆకాశంలో నల్లటి మబ్బులు, చల్లటి గాలులు మాత్రమే ఉన్నాయి.
తేలికపాటి జల్లులు, పెరిగిన చలి
దీంతో జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి చిరు జల్లులు పడ్డాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, దీంతో చలి తీవ్రత పెరిగింది.


