సంగారెడ్డి, 2026-11-22
తెలంగాణలోని పటాన్చెరు మండలం, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ బస్తీ దవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.