మంచిర్యాల జిల్లా DMHO శాఖ మరియు దిశ (DISHA) ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH)లో ఎయిడ్స్ అవగాహన మరియు నివారణ ప్రచారంలో భాగంగా ప్రత్యేక వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎయిడ్స్ పట్ల అప్రమత్తత, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకపోవడం, సురక్షిత జీవనశైలి ప్రాముఖ్యతను తెలియజేశారు.
ప్రజా పాలనా ప్రగతి ప్రణాలికా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వాకథాన్‌లో పలువురు వైద్యులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ మరియు దానిపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
ముఖ్య అతిథులుగా DMHO డాక్టర్ ఎస్. అనిత, GGH సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, ఎయిడ్స్ & లెప్రసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, MCH ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ అరుణ శ్రీ, GGH RMO డాక్టర్ శ్రీమన్నారాయణ, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి సుజాత హాజరయ్యారు. వీరు ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు.
CHO నామ్ దేవ్, Dy. మాస్ మీడియా ఆఫీసర్ వెంకటేశ్వర్లు, CHO శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, CHO వెంకటేశ్వర్లు, దిశ CPM నీలిమ, DMDO సంతోష్, ICTC శ్రీనివాస్, నరేందర్, నర్మద వంటి పలువురు అధికారులు, సిబ్బంది ఈ ప్రచారంలో పాల్గొన్నారు. వీరితో పాటు నర్సింగ్ కళాశాల విద్యార్థులు, స్నేహ NGO ప్రతినిధులు, లింక్ వర్కర్స్ స్కీమ్ సభ్యులు కూడా తమవంతు సహకారం అందించారు.












