హజీపూర్, 2026-11-20
హాజీపూర్ మండలం పెద్దంపేట నుంచి దొనబండ వరకు 6 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ రూ 4 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం పెద్దంపేట సర్పంచ్ జాడి వెంకటేష్ పనులు ప్రారంభించారు. రహదారి నిర్మాణంతో గ్రామాల ప్రజలకు, రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కవిత, గ్రామస్తులు పాల్గొన్నారు.


