మంచేరియల్ (అక్షరవేకువ) నవంబర్ 17
19 ఏళ్ల యువకుడు శివకుమార్‌ను అక్రమంగా నిర్బంధించి, చేతులకు సంకెళ్లు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
19 ఏళ్ల యువకుడు శివకుమార్‌ను అక్రమంగా నిర్బంధించి, చేతులకు సంకెళ్లు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచి కోర్టుకు సమర్పించాలని మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ప్రమోద్‌రావును ఆదేశించింది.
యువకుడి తల్లి కె. కల్పన దాఖలు చేసిన డబ్ల్యూపీ నంబర్ 37748/2026 పిటిషన్‌పై జస్టిస్ టి. మాధవీ దేవి విచారణ చేపట్టారు. తన కుమారుడిని రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిర్బంధించారని, కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే తన కుమారుడిని విడుదల చేశారని తల్లి ఆరోపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. యువకుడికి తన వాదనలు వినిపించే అవకాశం కల్పించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ కేసులో పోలీసుల విచారణ, సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారాయి. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.


