మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 23
రాబోయే 2028 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రాబోయే 2028 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర నూతన కాంగ్రెస్ ఇంచార్జ్ బీఎం సందీప్‌తో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా, రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల్లోకి వెళ్లాల్సిన తీరు, యువతను, మహిళలను ఆకట్టుకునే కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన పునాదిని మరింత పటిష్టం చేసుకుని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని బీఎం సందీప్ అన్నారు. అనంతరం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమై జిల్లాలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించారు.

