7వ వార్డు, దండేపల్లి (అక్షరవేకువ) అక్టోబర్ 09
దండేపల్లి మండల కేంద్రంలోని ఆసుపత్రి వెనుక ప్రాంతం, కాలనీవాసులే మొక్కలు పీకడం, చెత్తను తొలగించడం, డ్రైనేజీలను శుభ్రం చేసుకోవడం వంటి పనులు చేయాల్సి వస్తోందని తెలిపారు.
దండేపల్లి మండల కేంద్రంలోని ఆసుపత్రి వెనుక ప్రాంతం, 7వ వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో కాలనీవాసులే మొక్కలు పీకడం, చెత్తను తొలగించడం, డ్రైనేజీలను శుభ్రం చేసుకోవడం వంటి పనులు చేయాల్సి వస్తోందని తెలిపారు.
అదేవిధంగా, వార్డులో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడంతోపాటు వీధి దీపాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

