భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య సాక్షి ధోనీ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. కొత్త అందమైన అధ్యాయాలు ప్రారంభం కావాలంటే కొన్ని పాత అధ్యాయాలు ముగియాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ధోనీకి అండగా నిలిచిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మహీని చూసి ఎంతో గర్వపడుతున్నానని, ఆయన కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ధోనీ నాయకత్వంలో సీఎస్కే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.


