హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం మెన్స్ హాస్టల్-ఎం, అనెక్స్, ఎన్ఆర్ఎస్ హాస్టళ్లకు చెందిన 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో చికిత్స అందించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం మెన్స్ హాస్టల్-ఎం, అనెక్స్, ఎన్ఆర్ఎస్ హాస్టళ్లకు చెందిన 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో చికిత్స అందించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థుల కోసం హాస్టల్ సమీపంలో అత్యవసర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. హాస్టళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, శాశ్వత న్యూట్రిషన్ అధికారిని నియమించాలని వారు డిమాండ్ చేశారు.


