మహిళల భద్రత, ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యతనిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం ఒక వ్యాపార కేంద్రంగా ఎదగాలని, ప్రతి మహిళ తన నైపుణ్యాలతో ఆదాయం సంపాదించి సంపద సృష్టించాలని సూచించారు.
మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, చిన్నతరహా పరిశ్రమలు, గ్రామీణ వ్యాపారాలను అభివృద్ధి చేయడం ద్వారా కుటుంబాలు, గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావాలి. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి, అభివృద్ధిలో భాగస్వాములైనప్పుడే సమాజం మరింత ప్రగతి సాధిస్తుంది.
మహిళా సాధికారతే స్వర్ణాంధ్ర అభివృద్ధికి బలమైన పునాది అని ఈ సందర్భంగా తెలిపారు.











