తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నైలోని కావేరి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆయన వెంట భార్య, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన అర్లేకర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక అందించారు. అనంతరం చెన్నైకి తిరిగి వచ్చారు. అయితే, ఆయన ఆసుపత్రిలో చేరడానికి గల ఖచ్చితమైన కారణాలు, అందిస్తున్న చికిత్స వివరాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.


