సంగారెడ్డి, 9 November
సంగారెడ్డి శాసన సభ్యులు చింత ప్రభాకర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, జైపాల్ రెడ్డి, మల్లేశం తదితరులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి, నవంబరు 8: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీశ్ రావును సంగారెడ్డి శాసన సభ్యులు చింత ప్రభాకర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, జైపాల్ రెడ్డి, మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.



