మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్లక్ష్యానికి గురైంది. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు మందగించడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సబ్ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం, డాక్యుమెంట్ల పనితీరు మందగించడం వంటి కారణాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపిస్తోంది. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు పూర్తిగా మందగించడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కార్యాలయంలో డాక్యుమెంట్ల కదలిక మందగించడం, సబ్ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం ప్రజలను అవస్థలకు గురిచేస్తోంది.
డిప్యూటేషన్ అధికారి వల్ల సమస్యలు
డిప్యూటేషన్ పై వచ్చిన అధికారి వల్ల సమస్యల వలయంగా కార్యాలయం మారింది. కేవలం డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ తప్ప ఇతర పనులు జరగడం లేదు. దీంతో పలువురు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
సబ్ రిజిస్టర్ లీవ్ తో స్తంభించిన పనులు
9 నెలలుగా సబ్ రిజిస్టర్ ప్రియాంక రెడ్డి మెడికల్ లీవ్ లో ఉండటంతో, స్థానిక సర్వే నెంబర్లపై అవగాహన ఉన్న అధికారులు విధుల్లో లేకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పలువురు పేర్కొంటున్నారు. గత ఏడాది ప్రియాంక రెడ్డి లీవ్ పేరుతో విధులకు దూరంగా ఉన్నారు. కారణాలు ఏవైనాప్పటికీ, ఆమె పూర్తి బాధ్యత తీసుకోకుండా, పరిస్థితులపై అవగాహన చేసుకోకముందే వైద్యం పేరుతో దూరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఇన్చార్జ్ సీనియర్ అసిస్టెంట్ మురళి ఆసుపత్రి పనులతో దూరంగా ఉన్నారు. డాక్యుమెంట్ల పనితీరులో చలనం లేకుండా పోయింది. భూముల సర్వే నెంబర్లపై సంపూర్ణ అవగాహన మురళికి ఉండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా జరిగేది. ఆయన అందుబాటులో లేకపోవడంతో మరింత వేగం తగ్గింది.
రిజిస్ట్రేషన్ దారులకు ఇక్కట్లు
దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారికి ఇక్కట్లు పడుతూ కాలయాపన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ లో వేతనం తీసుకుంటూ మంచిర్యాలలో డ్యూటీ చేస్తున్న ప్రస్తుత డిప్యూటేషన్ పై ఉన్న రాజిరెడ్డి వల్ల ఈ పరిస్థితి నెలకొంది. సబ్ రిజిస్టర్ గా డిప్యూటేషన్ పై బాధ్యతలు తీసుకున్న రాజిరెడ్డి పూర్తి స్థాయిలో చురుకైన పాత్ర పోషించలేని పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు.
సబ్ రిజిస్టర్ కార్యాలయం పనితీరు మందగించి ఉండగా, మునిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పరిస్థితి తయారైంది. మరోపక్క, ఎల్ఆర్ఎస్ సమస్య, ఉరుము ఉరిమి మంగళవారం మీద పడ్డట్లుగా 22 ఏళ్ల నిషేధిత భూముల జాబితాలో చేరడంతో రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, గృహాల అమ్మకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సిటీలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలినట్లు కనిపిస్తుంది.
మంచిర్యాలలో వేలాది మందికి ఉపాధి కరువైంది. మార్కెట్లో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ ముచ్చట్లు, భూముల కొనుగోలు, అమ్మకాల చర్చలు ఉండేవి. ప్రస్తుతం ఇలాంటి వ్యాపారాల మాట వినిపించడం లేదు. లక్షలాది మందికి వ్యాపారం స్తంభించినట్లు కనిపిస్తుంది. దీంతో మంచిర్యాలలో ఆర్థిక వృద్ధి లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయి.












