మండలంలో మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి. గ్రామ సర్పంచ్ ఆడే శిలా, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తొడసం దౌలత్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మండల నాయకులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలు, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర గురించి నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో మోహితే మారుతీ, విశ్వంబర్, ఆడే జైపాల్, మాధవ్ మస్కె, మాధవ్ ససానే, వసీమ్ ఖాన్ తో పాటు పలువురు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.










