మహాత్మా గాంధీ జయంతి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ జయంతి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సాధన కోసం మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి మహాత్మా గాంధీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ ఏఓ విజయలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











