మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ, శాస్త్రి ఆశయాలను అనుసరించాలని నాయకులు పిలుపునిచ్చారు.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా అధ్యక్షుడు పూసల లింగాగౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆలోచనా విధానం, జీవనశైలి, అహింసా సిద్ధాంతం, శాంతి సందేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబర జీవితం, దేశ సేవను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.ప్రభుగౌడ్, బీసీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, జిల్లా విశ్రాంత సైనికుల సంఘం ప్రతినిధి లక్ష్మీ నారాయణలను సన్మానించారు. జిల్లా పరిషత్ ప్రధాన కార్యదర్శి డి. అంజయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుగౌడ్, మల్లికార్జున్ పాటిల్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు నాగిరెడ్డి, కిషన్, విశ్రాంత తహసీల్దార్ కిష్టయ్య, దశరథ్, విశ్రాంత సైనికులు, స్థానిక యువత శ్రీధర్, మహేంద్ర, సజ్జద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.












