మెదక్ జిల్లా చిలప్ మండలం, జగ్గంపేట గ్రామానికి చెందిన నవ భారతి పాఠశాల వ్యవస్థాపకులు దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ కు ఉపాధ్యాయ, సాహిత్య సేవా రంగాల్లో విశిష్ట కృషికి గాను విజయదశమి జాతీయ పురస్కారం లభించింది. హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
మెదక్ జిల్లా చిలప్ మండలం పరిధిలోని జగ్గంపేట గ్రామానికి చెందిన నవ భారతి పాఠశాల వ్యవస్థాపకులు, మిత్ర రత్నావళి, సాహిత్య రత్న, కాళోజి తెలుగు భాషా వైభవ జాతీయ పురస్కార గ్రహీత దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ కు ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో శ్రీ గౌతమేశ్వర సాహితీ గౌతమి కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ, సాహితీ సేవా రంగాలలో ఆయన చేస్తున్న విశిష్ట కృషికి గాను శాలువా కప్పి, స్వర్ణ కంకణంతో సత్కరించి, విజయదశమి జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో శ్రీ గౌతమేశ్వర కళా సేవా సంస్థ వ్యవస్థాపకులు దూడపాక శ్రీధర్, కవులు తూము నర్సయ్య, దేవీప్రియ, వరలక్ష్మీ, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.











