13 కోట్ల ఓట్లను దొంగిలించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, డీసీసీ అధ్యక్షులకు మంగళవారం రాత్రి దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘురాం రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
13 కోట్ల ఓట్లను దొంగిలించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ జాతీయ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, డీసీసీ అధ్యక్షులకు మంగళవారం రాత్రి దిశానిర్దేశం చేశారని మంచిర్యాల కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి వివరాలను వెల్లడించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు చేర్చడంతో పాటు, ప్రజాపాలన లక్ష్యాలను కాంగ్రెస్ శ్రేణుల ద్వారా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, పార్టీ బలోపేతంతో పాటు ప్రజలను కాంగ్రెస్ పాలన వైపుకు ఆకర్షణ కార్యాచరణ ఉండాలని దిశానిర్దేశం చేసినట్లు రఘునాథ్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నట్లు రఘునాథ్ రెడ్డి చెప్పారు.











