సంగారెడ్డిలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొని, జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. నిత్యం ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ శిబిరంలో పాల్గొని, జర్నలిస్టులను అభినందించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని ఆయన సూచించారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. సంగారెడ్డి సన్రైజ్ హాస్పిటల్, రథ సారథి దినపత్రిక సహకారంతో ఈ వైద్య శిబిరం జరిగింది. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరిలు మాట్లాడుతూ తమ యూనియన్ రాష్ట్ర శాఖ గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిందని, అదే స్ఫూర్తితో సంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. సన్ రైజ్ హాస్పిటల్, రథసారధి పత్రిక వారు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జర్నలిస్టులు నిత్యం అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్మాల్ అండ్ మీడియం అధ్యక్షుడు మహమ్మద్ సిద్దిఖ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనీల్ కుమార్, టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, ప్రధాన కార్యదర్శి రవి, ఇతర నేతలు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, యాదవ రెడ్డిలు పాల్గొని, సన్ రైజ్ హాస్పిటల్ అధినేత స్వామి గౌడ్, రథసారధి ఎం.డీ. సంతోష్ గౌడ్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

