విజయానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాల మధ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య అన్నారు. సోమవారం సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు.
ఈ పండుగ ప్రజల్లో కొత్త ఆశలను, ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందంగా సూచించారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమాభిమానాలతో మెలగాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. ప్రజలందరూ సంతోషకరమైన వాతావరణంలో దసరా పండుగను ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాఠకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.











