మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్క నాగరాజు గౌడ్ బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజయదశమి పండుగ సుఖసంతోషాలు అందించాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్క నాగరాజు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసంలో నక్క నాగరాజు గౌడ్‌తో పాటు కౌన్సిలర్ శ్రీకాంత్, మాజీ సర్పంచులు వీరేశంగౌడ్, వీరన్న యాదవ్, మంగళకర్ తదితరులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరికీ విజయదశమి పండుగ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలను అందించాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలను నింపాలని హరీష్ రావు పేర్కొన్నారు.












