పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం కోరారు. హైదరాబాద్లో శనివారం మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్ కమిటీ పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వివరిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి ద్వారా రైతులకు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చైర్మన్ ఏపూరి శివానందం తెలిపారు.


