ఈ నెల 30న ఉమ్మడి జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు మంచిర్యాల జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు డా. ఉదారి చంద్రమోహన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సభకు సుమారు వెయ్యి బైకులతో తరలివెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ కార్మిక శాఖ మంత్రి బోడ జనార్దన్ కార్యాలయంలో పాంచజన్య సంకల్ప సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.
సభకు మంచిర్యాల జిల్లా నుంచి సుమారు వెయ్యి బైకులతో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని చంద్రమోహన్ గౌడ్ సూచించారు.
ఈ సందర్భంగా బోడ జనార్దన్ మాట్లాడుతూ మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరారు. సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ తిప్పర్తి సారన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా యువజన అధ్యక్షుడు ఐత ప్రశాంత్, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పొలసాని హారిక రావు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, కొరకొప్పుల మహేష్ గౌడ్, వేముల సాయి కుమార్ గౌడ్, సందీప్ గౌడ్, సంపత్, అనిల్, సంపత్ కుమార్, జహీర్ ఖాన్, శ్రీవాణి, రజిత, హెచ్ఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









