పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగిరి ఖిల్లా చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు యువతకు ఒక వినూత్న ఛాలెంజ్‌ను ప్రకటించారు. ఖిల్లాలోని ఏడు గేట్లు దాటి హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా, యువత తమ ట్రెక్కింగ్ ప్రయాణాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో హాయ్ వంశీ.. ఇట్స్ మీ అని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయాలని ఎంపీ సూచించారు. ఒక నెలలోపు అత్యంత వేగంగా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన విజేతకు ప్రత్యేకంగా ఒక వన్‌ప్లస్ మొబైల్ ఫోన్‌ను బహుమతిగా అందజేస్తామని ఆయన ప్రకటించారు.
మన ప్రాంతంలో ఎన్నో అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు ఉన్నాయని, వాటిని సందర్శించడం ద్వారా మన చరిత్ర గొప్పతనం తెలుస్తుందని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. రామగిరి ఖిల్లాను స్వయంగా సందర్శించిన తర్వాత ఈ ప్రాంతంపై తనకు మరింత నమ్మకం, ఆసక్తి పెరిగిందని తెలిపారు.
ఇలాంటి చారిత్రక ప్రదేశాలను యువత సందర్శించి, వాటి విశిష్టతను సోషల్ మీడియా ద్వారా మరింత మందికి తెలియజేయాలని ఆయన ఆకాంక్షించారు. మన ప్రాంతంలోనే ఇంత గొప్ప హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. యువత అందరూ రామగిరి ఖిల్లాను సందర్శించి ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలి. టూరిజాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.
ట్రెక్కింగ్ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలని, సురక్షితంగా ఛాలెంజ్ పూర్తి చేయాలని ఆయన సూచించారు. రామగిరి ఖిల్లా చారిత్రక ప్రాధాన్యతను, పర్యాటక ఆకర్షణను మరింత పెంచేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీ తెలిపారు.
జై హింద్.. జై తెలంగాణ


