తెలంగాణ రాష్ట్రానికి కరువు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదిలాబాద్ లో ఈరోజు జరిగిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడారు.

రైతులు పంటలు వేయవద్దని చెప్పే ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మరిచిపోయిన ముఖ్యమంత్రి అవసరం లేదని ఆయన విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని, రిమ్స్ అగ్ని ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించే తీరిక కూడా లేదని ఆయన ఆరోపించారు.
మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.