సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు సుగుణమ్మ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సుగుణమ్మకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సుగుణమ్మ సేవలను ఎస్పీ కొనియాడారు.
ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది సహజమని, ఉద్యోగ కాలంలో అందించిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సుగుణమ్మ గత 30 సంవత్సరాలుగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా పోలీసు శాఖ తరఫున సుగుణమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్ఐలు డానియెల్, సురేష్ నాయక్, పదవీ విరమణ పొందుతున్న సుగుణమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







