ఆదిలాబాద్, 14 November
గుడిహత్నూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతిని ఘనంగా నిర్వహించారు.
గుడిహత్నూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, ఉపాధ్యక్షులు మోహితే మారుతీ, నాగనాథ్ అప్పా కాగ్నే, రాంకిషన్ ముండె, గణేష్, ఆడే జైపాల్, సమీర్ ఖాన్, మాధవ్ మస్కె తదితరులు నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశ అభివృద్ధి, విద్యా, పరిశ్రమల రంగాలకు నెహ్రూ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.


