పటాన్చెరు, 17 November
జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత్రికేయ సోదర, సోదరీమణులందరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.
పటాన్ (అక్షరవేకువ): జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత్రికేయ సోదర, సోదరీమణులందరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.
నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో, అవినీతి అక్రమాలను ప్రశ్నించడంలో, సామాన్య ప్రజల గొంతుకగా నిలవడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని ఆయన అన్నారు. ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ సమాజ హితం కోసం అహర్నిశలు పనిచేస్తున్న పాత్రికేయుల సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా పత్రికా రంగం మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, సామాజిక చైతన్యం పెంపొందించడంలో జర్నలిస్టులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ, జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు.


