మంచేరియల్, 18 November
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో బుధవారం రాత్రి ఎస్సై మధుసూదన్ నేతృత్వంలో పోలీసు బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా రౌడీషీటర్ల వివరాలు, వారి కదలికలు, అపరిచిత వ్యక్తుల సంచారం, అనుమానాస్పద వ్యక్తుల కార్యకలాపాలపై ఆరా తీశారు.
సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ రత్నపురం ప్రకాష్, సీఐ ప్రమోదరావు ఆదేశాల మేరకు వివిధ డివిజన్లలో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా అనుమానితుల వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో పోలీసు బృందాలతో పాటు రాపిడ్ యాక్షన్ బలగాలు కూడా పాల్గొన్నాయి.


