సంగారెడ్డి, 10 November
తెలంగాణ ప్రభుత్వ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఈఎస్ఐ) శాఖ పరిధిలో ఔట్సోర్సింగ్, యాక్టివిటీ ఏజెన్సీల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం జరిగాయని ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గౌతమ్ తెలిపారు. ఏజెన్సీల నియామకాలపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఈఎస్ఐ) శాఖ పరిధిలో ఔట్సోర్సింగ్, యాక్టివిటీ ఏజెన్సీల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం జరిగాయని ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏజెన్సీల నియామకాలపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఏజెన్సీల ఎంపిక, కేటాయింపు ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే జరిగిందని ఆయన తెలిపారు. జీఓఎంఎస్ నంబర్ 4271తో పాటు వర్తించే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సంబంధిత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ఔట్సోర్సింగ్ కమిటీ ద్వారానే ఏజెన్సీలను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.


