ఆస్ట్రేలియా క్రికెట్లో 2018లో సంచలనం సృష్టించిన బాల్ ట్యాంపరింగ్ వివాదం (శాండ్పేపర్ గేట్) మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తాజాగా కామెరాన్ బ్యాన్క్రాఫ్ట్ వెల్లడించిన విషయాలకు మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా మద్దతు తెలిపారు.
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో బంతి ఆకారాన్ని మార్చేందుకు శాండ్పేపర్ ఉపయోగించిన ఘటనలో కేవలం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బ్యాన్క్రాఫ్ట్ మాత్రమే బాధ్యులుగా నిలిచారని, అయితే జట్టులోని ఇతరులకు కూడా ఈ విషయం తెలుసని ఖవాజా తన ఆత్మకథ సబ్ర్లో పేర్కొన్నారు. తాజాగా బ్యాన్క్రాఫ్ట్ కూడా జట్టులోని అందరికీ ఈ విషయం తెలుసని తన అనుభవాలను వెల్లడించారు. గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ సమయంలో పూర్తి నిజాలు చెప్పలేకపోయానని బ్యాన్క్రాఫ్ట్ అంగీకరించారు. మరోవైపు, అప్పటి ఘటనపై ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలతో తాను బాధపడ్డానని బ్యాన్క్రాఫ్ట్ తెలిపారు. ఈ వివాదంపై ఆటగాళ్ల వాదనలు వినేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా స్వతంత్ర వేదికను ఏర్పాటు చేసింది.


