తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో, బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ కు NQAS కింద అందించిన అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలందించినందుకు ప్రశంసలు లభించాయి.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో, ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష సేవలందించిన వారికి గుర్తింపు లభించింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ముందుంది.
ఈ సందర్భంగా, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ పనితీరును అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో ఆసుపత్రి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.
ఈ వేడుకల్లో ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య రంగ నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ గుర్తింపు ఆసుపత్రి సిబ్బందికి మరింత స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు.







